నవగీతం, ఇబ్రహీంపట్నం ప్రతినిధి:
ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు మాజీ సర్పంచ్ పుప్పాల నర్సయ్య ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఎగురవేశారు. టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఎగరవేసినట్లు నర్సయ్య తెలిపారు. అనంతరం నినాదాలు చేస్తూ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కంటం రమేష్, తోకల డేవిడ్, కోటి అరుణ్, మాజీ ఉపసర్పంచ్ కోటి దేవరెడ్డి, డాక్టర్ మైపాల్, బైన నడిపి మల్లయ్య, సుంకరి రాజేష్, పుప్పాల చిన్నకాశన్న, సమ్మెట రఘు, కంఠం రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు
గోదుర్ లో బిఆర్ఎస్ ఆవిర్భవ వేడుకలు
ఇబ్రహీంపట్నం మండలం గోదూర్ లో ఘనంగా 26 సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు సాత్పాటి పురుషోత్తం జండా ఆవిష్కరణ చేసి స్వీట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పురుషోత్తం మాట్లాడుతూ పార్టీ పెట్టి 14 సంవత్సరాల లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్ 10 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు ఉంచారు కాంగ్రెస్ మాయమాటల్ని నమ్మిన ప్రజలు ఇప్పుడు వాళ్ల మోసాన్ని గ్రహించి మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారన్నారు. రాబోయే రెండు సంవత్సరాల్లో మళ్లీ కెసిఆర్ ప్రభుత్వమే వస్తుందని ఎమ్మెల్యే సంజయ్ అన్న ఆదేశాలు పాటిస్తూ. బి ఆర్ఎస్ పార్టీని ఇంకా పటిష్టంగా బలంగా తయారు చేద్దామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ తిరుపతిరెడ్డి, ఉప అధ్యక్షుడు తాటికొండ రాజు, మాదం భూమన్న, వనతడుపుల రాజేష్, చిట్యాల రా ములు, చల్ల మల్లేష్ దానవేణి ప్రమోద్, మాదం రాజేష్ ,పడాల రాజు సాత్పడి శ్రీనివాస్, బండి మనోజ్ మేడిపల్లి జైపాల్ ఎడపల్లి నరసయ్య తదితరులు పాల్గొన్నారు
