navageetam.com
Newspaper Banner
Date of Publish : 08 April 2026, 9:43 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

డిఈవో రాము ని సన్మానించిన ఆర్.యు.పి.పి.హిందీ ఫోరం జిల్లా శాఖలు

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎలమౌంట్ కార్మెల్ స్కూల్ లో ఈనెల-1 నుండి జరుగుతున్న తెలుగు, హిందీ, గణిత సబ్జెక్టు ల పదవ తరగతి పరీక్షల మూల్యాంకనం ప్రశాంతంగా, పకడ్భందిగా బుధవారం ముగిసింది. ఈ సందర్బంగా జిల్లా విద్యాధికారి కె రాము ని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లా అధ్యక్షప్రధాన కార్యదర్శులు వేల్పుల స్వామి యాదవ్, ఎనగందుల రాజేంద్ర ప్రసాద్, జిల్లా హిందీ ఫోరం అధ్యక్షులు కస్తూరి శ్రీధర్ లు ఆర్.యు.పి.పి, హిందీ ఫోరం ల పక్షాన ఘనంగా సన్మాంచి మిఠాయి తినిపించారు. రాష్ట్రం లో ఎ జిల్లాలో కూడా గత సంవత్సరం మూల్యాంకన రెమ్యూనరేషన్ ఇవ్వలేదని, కేవలం మన జగిత్యాల జిల్లాలో నే డిఈవో విడుదల చేసి జమచేయడం అభినందనీయని మిఠాయి తినిపించారు. విద్యార్థులకు కనీస సామర్థ్యాలు వచ్చే విధంగా కృషి చేయాలని అన్నారు. స్పెషల్ అసిస్టెంట్ చాడ నీరజకు డీఈవో చేతుల మీదుగా పండిత పరిషత్ జిల్లా అధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్ భగవద్గీత ప్రదానం చేసారు. ఈ కార్యక్రమం లో డిఫ్యూటి క్యాంప్ ఆఫీసర్ చంద్రకళ, ఎసిజిఈ నరేందర్, హిందీ ఎసివో అనిత, హిందీ సి ఈ లు వసంతరావు, వంగపల్లి సంపత్, రవీందర్, రమణాచారీ, మహమూద్, సయీద్ పాషా, జ్యోతిరాణి, నీరజ, బండి సుధాకర్, వేణు తదితరులు పాల్గొన్నారు.