navageetam.com
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 5:13 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

తహశీల్దార్ కు పాలక వర్గం సన్మానం

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:

మల్లాపూర్ మండల నూతన తహశీల్దార్ గా కే.రామచందర్  ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ములుగు జిల్లా నుంచి డిప్యూటీ తహశీల్దార్ గా పదోన్నతి పొందిన ఆయన మల్లాపూర్ తహశీల్దార్ గా బాధ్యతలు తీసుకోవడం ఆనందం గా ఉన్నదని,నిత్యం అందుబాటులో ఉంటూ మెరుగైన రెవెన్యూ సేవలు అందించాలని మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ కు మల్లాపూర్ వార్డు సభ్యులు ముష్కరి రమేష్, ముత్యాల గంగా రాజం, అరికుప్పల చిన్న రాజం, భుక్యా శేఖర్, కొంపెల్లి రాకేష్, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి  అభినందనలు తెలిపారు.