నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:
మల్లాపూర్ మండల కేంద్రానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసిల్దార్ రామ్ చందర్ ని మల్లాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి సాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నత్తి రాము రాఘవపేట గ్రామ అభివృద్ధి విషయాలు మరియు మల్లాపూర్ మండలానికి సంబంధించిన పలు అంశాలపై ఏలాల జలపతి రెడ్డి చర్చించారు.అలాగే మండలంలోని గ్రామాలలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకొని అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ జిల్లా అధ్యక్షులు ఎలాల జలపతి మల్లాపూర్ ఉప సర్పంచ్ సోమ రెడ్డి, వార్డ్ సభ్యులు నత్తి రాము బండారి రమేష్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.