తిప్పాయపల్లిలో ఐకేపీ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

నవగీతం, కొడిమ్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిప్పాయపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మల్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొండూరి రాజేష్, తిప్పాయపల్లి సర్పంచ్ ల్యాగలా రాజేశం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పాలకవర్గ సభ్యులతో కలిసి వారు రిబ్బన్ కట్ చేసి ఐకేపీ సెంటర్‌ను ప్రారంభించారు. గ్రామ మహిళా సంఘాల అభివృద్ధికి, స్వయం ఉపాధి అవకాశాల పెంపుకు ఈ కేంద్రం కీలకంగా ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గ్రామీణ మహిళలు...