తెలంగాణను గొప్ప టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

నవగీతం,హైదరాబాద్: వస్త్ర పరిశ్రమ రంగంలో 2047 నాటికి తెలంగాణను దక్షిణాసియాలోనే గొప్ప టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. టెక్స్‌టైల్ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిర్దేశించుకున్న విజన్‌కు అనుగుణంగా ప్రపంచాన్ని మార్చగల వాతావరణాన్ని సృష్టించడంలో మాతో భాగస్వామ్యం కావాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ (CITI) తో కలిసి 13వ ఏషియా టెక్స్‌టైల్ సదస్సు (ATEXCON 2026)ను నిర్వహించింది.ఈ సదస్సులో ముఖ్యమంత్రి  అటెక్స్‌కాన్-2026 నివేదికను విడుదల చేశారు. ఈ సదస్సులో మంత్రులు...