తెలంగాణలో అన్ని చోట్లా బీసీలకు, ఈబీసీలకు అన్యాయం – పోరాటమే శరణ్యం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన 1956 నుండి ఇప్పటి తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరకు బీసీలు, ఈబీసీలు అనుభవిస్తున్న అన్యాయాల చరిత్ర ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. పాలకులు మారినా పాలనలో ముఖ్యమంత్రికి ఉన్న సామాజిక వర్గాధిపత్యం , కులాధిపత్యం మాత్రం మారలేదు. రాష్ట్ర నిర్మాణం, రాజకీయ వ్యవస్థలు, ప్రభుత్వ యంత్రాంగం అన్నీ మారినప్పటికీ సామాజిక న్యాయం మాత్రం అణగారిన వర్గాలకు అందలేదు. ఈ నేపథ్యంలో 1956 నుంచి ఇప్పటి వరకు వివిధ ముఖ్యమంత్రుల పాలనలో చోటు చేసుకున్న కుల ఆధిపత్యం, బీసీలకు జరిగిన...