తెలంగాణ పోలీసులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు
వరుసగా మూడోసారి ఓవరాల్ ఛాంపియన్ ట్రోఫీ నవగీతం, హైదరాబాద్: ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ లో వరుసగా మూడోసారి ఓవరాల్ ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకుని హ్యాట్రిక్ సాధించిన తెలంగాణ పోలీసులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ విజయం రాష్ట్ర పోలీసుల నిరంతర కృషి, క్రమశిక్షణకు నిదర్శనమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.తెలంగాణ సీఐడీ పర్యవేక్షణలో నిరంతర శిక్షణ ఈ విజయానికి కారణమైందని, జాతీయ స్థాయిలో మరోసారి ప్రతిభ చాటిన సందర్భంగా ముఖ్యమంత్రి డీజీపీ బి. శివధర్ రెడ్డి , సీఐడీ అదనపు...