రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కాసరాజు పటేల్ నియామకం
నవగీతం, కరీంనగర్ ప్రతినిధి:
ఉత్తర తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘ వేములవాడ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ అధ్యక్షతన నూతనంగా తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడి గా కరీంనగర్ కి చెందిన కాస రాజు పటేల్ కి నియామక పత్రము అందజేసి వారికి శాలువాతో సత్కరించి రాజరాజేశ్వర స్వామి ఫోటో అందజేయడం జరిగినది కొండా దేవయ్య పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో సుమారు 584 మండలాలు 12వేల గ్రామ సంఘాలలో యూత్ కమిటీ సంఘాలు ఏర్పాటు చేయాలని యూత్ కమిటీ ల ద్వారా యువకులందరినీ ఒక ఐక్యతకు తీసుకువచ్చి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా యువకులందరూ ఉద్యోగాలలో, బిజినెస్ లో సెటిల్ అయ్యే విధంగా యూత్ కమిటీ సభ్యులు కృషి చేయాలని గ్రామస్థాయి స్థానిక ఎన్నికలలో వార్డ్ స్థాయిలో వార్డ్ మెంబర్లు ఎక్కువ సంఖ్యలో గ్రామ సర్పంచులు ఉపసర్పంచ్లు ఎక్కువ సంఖ్యలో గెలవడం జరిగిందని మున్సిపల్ ఎన్నికలలో యువకులు చాలామంది కౌన్సిలర్లుగా చైర్మన్ గా వైస్ చైర్మన్ గా ఎన్నిక కావడం జరిగిందని మరియు కార్పొరేషన్లలో కార్పొరేటర్లుగా మేయర్లుగా యువకులందరికి అవకాశాలు వచ్చినాయి రాబోయే హైదరాబాద్ కార్పొరేషన్ లో వరంగల్ ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలలో యువకులందరూ కార్పొరేటర్ గా గెలిచి మున్నూరు కాపు జెండా ఎగరవేయాలని కోరుచూ ఈరోజు 24 మున్సిపాలిటీలలో చెర్మన్ జెండా ఎగురవేయడం జరిగిందని సుమారు ఒక వెయ్యి మంది గ్రామ సర్పంచులు ఉప సర్పంచులుగా ఎన్నికయ్యారని వేల సంఖ్యలో వార్డు సభ్యులు కౌన్సిలర్లు కార్పొరేటర్లు గెలవడం జరిగిందని వచ్చే ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలలో మున్నూరు కాపు పటేల్స్ యువకులందరూ ఎంపిటిసిలుగా జడ్పిటిసిలుగా గెలవాలని దానికి స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో మండలాలలో గ్రామస్థాయిలో మున్నూరు కాపు పటేల్స్ యూత్ కమిటీలు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శవంతంగా యువతరం ముందు సాగాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య పటేల్ మహిళా పటేల్ సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పురెళ్లి సరోజ పటేల్ కూరగాయల కొమురయ్య పటేల్ నామాల పోశెట్టి పటేల్ సంఘం స్టేట్ మీడియా సెక్రటరీ వంగాల రమేష్ పటేల్ మరాఠీ సత్తన్న పటేల్ పాల్గొన్నారు