navageetam.com
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 7:40 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

దుద్దిల్ల శ్రీపాద రావు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:

మెట్ పల్లి పట్టణ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లోఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 27వ వర్థంతి సందర్భంగా మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న నాయకుడు శ్రీపాదరావు ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.సర్పంచ్ స్థాయి నుంచి శాసనసభ స్పీకర్ వరకు అనేక పదవులకు వన్నె తెచ్చిన నాయకుడని కొనియాడారు. శ్రీపాదరావు జీవితం నేటి తరానికి ఒక గొప్ప స్ఫూర్తి అని కూన గోవర్ధన్ వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కల్లెడ గంగాధర్ ,యన్ ఎస్ యూ ఐ నాయకులు సమీర్ సర్కార్, షాజబ్,ఇర్ఫాన్, రెహాన్,అషు,ఫైజ్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.