navageetam.com
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 7:21 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

దేశానికి దిశానిర్దేశం చేసిన మహా నాయకుడు అంబేద్కర్

నవగీతం, కోరుట్ల ప్రతినిధి:

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను కోరుట్ల పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి కోరుట్ల. శాసనసభ్యులు కల్వకుంట్ల సంజయ్ , మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. కుల రహిత సమాజం కోసం,అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని, ఆయన చూపిన బాటలో నడవడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, వివిధ సంఘాల ప్రతినిధులు మరియు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.