దేశానికి దిశానిర్దేశం చేసిన మహా నాయకుడు అంబేద్కర్
నవగీతం, కోరుట్ల ప్రతినిధి: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను కోరుట్ల పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి కోరుట్ల. శాసనసభ్యులు కల్వకుంట్ల సంజయ్ , మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. కుల రహిత సమాజం కోసం,అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన...