navageetam.com
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 4:07 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

దొడ్డి కొమురయ్య ఆశయాలు నేటి యువతకు స్పూర్తి

నవగీతం, జగిత్యాల ప్రతినిధి

తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య కురుమ 99వ జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణ ధర్మపురి రోడ్డు లో విజయపురిలో ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొమురయ్య స్పూర్తి తో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అని దొడ్డి కొమురయ్య ఆశయాలు నేటి యువత స్పూర్తిగా తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్,మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, ఏయంసి ఛైర్మెన్ గడ్డం నారాయణ రెడ్డి, కమిషనర్ స్పందన,కౌన్సిలర్ లు చెట్టే గంగాధర్ ,దయాళ చంద్రకళ శంకర్, కోరే జయ గంగమల్లు,పిట్ట ధర్మరాజు, ఏనుగుల లావణ్య రాజు,కూతురు రాజేష్,చీటి లక్ష్మీ నారాయణ, దుమాల రాజ్ కుమార్,హరీష్, మమత రామకృష్ణారెడ్డి,మాజీ కౌన్సిలర్ కుసరి అనిల్ కుమార్,జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు బీరం రాజేష్,నాయకులు బాల ముకుందం,దయాళ మల్లారెడ్డి పుల్ల మల్లయ్య,కురుమ సంఘం సభ్యులు ,పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.