ధాన్యం కొనుగోళ్లలో జాప్యం – చొప్పదండి లో బీఆర్ఎస్ నిరసన
నవగీతం, చొప్పదండి ప్రతినిధి: కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా.(తెలంగాణ చౌరస్తా) వద్ద మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డు పై బైఠాయించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ— పాత పద్ధతే బాగుండే కెసిఆర్ ఉన్నప్పుడు రైతులకు ఏ ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేశారు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించకుండా దాదాపు 25 రోజులు గడిచిపోయాయని విమర్శించారు. నూతనంగా ప్రవేశపెట్టిన జీపీఎస్ విధానం, ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు...