చదువులో రాణించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి..
రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..
నవగీతం,జగిత్యాల ప్రతినిధి:
రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలో ల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు పౌష్టిక ఆహారం ఇవ్వాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజా పాలన- ప్రగతి నివేదనలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణలో భాగంగా సంక్షేమ వారోత్సవాల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మ గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మంత్రి అల్పాహారం చేశారు. రాష్ట్రంలో ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ విద్యార్థులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశయ సాధన లో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి ఈ సందర్భంగా విద్యార్థులను కోరారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టిక ఆహారం అందించాలని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయించారని మంత్రి తెలిపారు.

ఇందులో భాగంగా ప్రతి హాస్టల్లో పౌష్టిక ఆహారం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో విద్యార్థులకు కాస్మెటిక్ చార్జీలు పెంచడం జరిగిందని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం అందించడానికి చర్యలు చేపట్టామని మంత్రి వివరించారు. విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను నిజం చేస్తూ ప్రభుత్వా లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని చదువులో రాణించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు.

ఈసందర్భంగా విద్యార్థులు వెల్లడించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంగనబట్ల దినేష్, ఆర్డీవో మధుసూదన్, డీసీసీ అధ్యక్షులు నందయ్య, కౌన్సిలర్లు దుమాల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.