navageetam.com
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 2:59 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల ముఖ్యమంత్రి సంతాపం

నవగీతం,హైదరాబాద్:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఎంపీగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో వారి అనేక ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొన్నారని గుర్తుచేశారు.ఈ దుఃఖ సమయంలో నాదెండ్ల కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని, భాస్కరరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి మరణంపట్ల ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.