సహకరించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు
నవగీతం,కోరుట్ల ప్రతినిధి:
కోరుట్ల నియోజకవర్గంలోని మూడు మండలాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలు గురువారం ప్రారంభంకానున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు తెలిపారు వేములవాడ ఎమ్మెల్యే,రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి మార్క్ పేడ్ ఎండిని బుధవారం సంప్రదించి అత్యవసరంగా కోరుట్ల నియోజకవర్గంలో మూడు మండలాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయగా వెంటనే మార్క్ఫెడ్ యండి మంజూరు చేశారని గురువారం ఉదయం నియోజకవర్గంలోని మల్లాపూర్ కోరుట్ల మెట్ పల్లి లో మార్క్ పెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు తెలిపారు.ఈ మంజూరి కి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు కోరుట్ల నియోజకవర్గ రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు జువ్వాడి కృష్ణారావు పేర్కొన్నారు