నీతి ఆయోగ్ ‘దివ్య భారత్’ నివేదికలో కొండగట్టు ఆలయానికి స్థానం

నవగీతం, కొడిమ్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా మల్యాల మండలం, ముత్యంపేట గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ విడుదల చేసిన ‘దివ్య భారత్’ నివేదికలో స్థానం లభించింది. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల విశేషాలను దేశీయ, విదేశీ పర్యాటకులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ నివేదికను రూపొందించారు.ఈ సందర్భంగా ఆలయ ఈఓ ఎస్ అంజనారెడ్డి సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.నివేదికలో ఆలయానికి చోటు కల్పించడంలో సహకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్...