నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లలో భాగంలో చిట్టాపూర్ గ్రామంలో పబ్బతి జ్యోతి శేఖర్ నూతనంగా నిర్మించుకున్న ఇంటిలో గురువారం రాష్ట్ర సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం నిర్వహించారు. అనంతరం ఆ కుటుంబ సభ్యులకు నూతనవస్త్రాలు అందించి వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంపతి శంకరమ్మ, ఉప సర్పంచ్ బాల్సని ప్రణయ్ గౌడ్, వేంపేట్ సర్పంచ్ గోరుమంతుల ప్రవీణ్,వార్డు సభ్యులు ఇట్టెడి శంకర్,పాశం నవ్య,పబ్బతి రాజేష్,కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యశులు ఎల్లాల రాజేష్ ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్తపల్లి రాజారెడ్డి, బక్కురి చింతామణి,కొత్తపల్లి రాజేందర్,గడ్డం లింగారెడ్డి,మహిళలు తదితరులు పాల్గొన్నారు.
