navageetam.com
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 7:45 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

నూతన వంటగది ప్రారంభం

నవగీతం, కోరుట్ల ప్రతినిధి:

కథలాపూర్ మండలం సీరికొండ గ్రామంలో మంగళవారం రోజున ఉర్దూ ప్రాథమిక పాఠశాల ,అంగన్వాడీ కేంద్రంలో మహాత్మా గాంధీ ఉపాధి పథకం ద్వారా విడుదలైన నిధులతో నిర్మించిన నూతన వంటగదిని గ్రామ సర్పంచ్ ముదాం రవీందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిధులకు సహకారాన్ని అందించిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్,వికాస్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పంచాయతీ కార్యదర్శి నర్సారెడ్డి, చిట్కూరి మల్లయ్య, వెంకటేశ్వరరావు,మాల్యాల మారుతి, గాంధారి శ్రీనివాస్, కాసోజి ప్రతాప్, హఫీజోద్దీన్, ప్రమోద్, నాంపల్లి లింబాద్రి, వీరమల్ల శ్రీనివాస్, శ్రీకర్, గ్రామస్తులు పాల్గొన్నారు.