నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:
మల్లాపూర్ మేజర్ పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో సోమవారం గ్రామం లో పాడయిపోయిన విద్యుత్ స్థంభం ల స్థానం లో నూతన స్తంభాలను ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామం లో ఎక్కడ పాడైపోయిన విద్యుత్ స్థంభం లు ఉన్నా పాలక వర్గం కు సమాచారం ఇస్తే వెను వెంటనే కొత్త విద్యుత్ స్థంభం లు ఏర్పాటు చేయిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సోమ రెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు ముష్కరి రమేష్, శనిగారపు నరేష్ ,కదుర్క రాజేందర్,కాషవత్తుల గంగ రెడ్డి,సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.