నవగీతం, కోరుట్ల ప్రతినిధి:
కోరుట్ల పట్టణంలోని సాయిరాంపూర కాలనీలో గల శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభను చూపారు.
కట్కం ప్రణవి 585 మార్కులతో పట్టణంలో ప్రథమ స్థానాన్ని సాధించారు.
100% ఉత్తీర్ణత తోపాటు 77 మంది విద్యార్థులకు గాను 52 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించారు.
పాఠశాల ప్రిన్సిపల్ రేణుక మాట్లాడుతూ శ్రీ చైతన్య పాఠశాల ఇంటిగ్రేటెడ్ కరిక్యులం మరియు 10వ తరగతి రివిజన్ ప్రోగ్రాం ఎంతగానో ఉపయోగపడింది అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీవిద్య , చైర్మన్ శ్రీధర్ ,ఎజిఎం రాజు అకాడమిక్ కోఆర్డినేటర్ ప్రవీణ్ ,అకాడమిక్ డీన్ రాజశేఖర్, సి బ్యాచ్ ఇంచార్జ్ అనిల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.