పర్యావరణ పరిరక్షణపై అవగాహన పోస్టర్ ఆవిష్కరణ చేసిన కలెక్టర్

నవగీతం,జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు రూపొందించిన ప్రత్యేక పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ కలెక్టర్ ఛాంబర్ లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...పర్యావరణ సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. చెట్ల పెంపకం, నీటి సంరక్షణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు వంటి అంశాల్లో ప్రతి ఒక్కరూ చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, హరిత వాతావరణాన్ని అందించేందుకు సమాజంలోని అన్ని వర్గాలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.పోస్టర్‌లో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ముఖ్య...