గాంధీభవన్ లో సంఘటన్ సృజన్ అభియాన్ సమీక్షా సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్
పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు
నవగీతం,కొత్తగూడెం ప్రతినిధి:
తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్, ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ తెలిపారు.సోమవారం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో జిల్లా అధ్యక్షులతో సంఘటన్ సృజన్ అభియాన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూరాబోయే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే ప్రతి కార్యకర్త ధ్యేయం కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ తన కుటిల యత్నాల్లో భాగంగా తెలంగాణలో సెక్యులర్ ఓట్లను తొలగించేందుకు పన్నాగం పన్నుతోందని, అడ్డదారుల్లో ఓట్లను తొలగించేందుకు చేస్తున్న కుట్రను అడ్డుకోవాలని సూచించారు. బూత్ లెవెల్ ఏజెంట్ (BLA) నియామకం, పనితీరు విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని, క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత కోసం బీఎల్ ఏలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
