నవగీతం,మేట్ పల్లి ప్రతినిధి:
ఇటీవల మరణించిన ఖుతుబోద్దీన్ పాషా,అజీమ్ ల తల్లి ఆత్మకు భగవంతుడు శాంతి ప్రసాదించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషా, మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా ప్రధాన కార్యదర్శి అజీమ్ లను ఆయన పరామర్శించారు. తల్లి మృతికి గల కారణాలు తెలుసుకొని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్ రెడ్డి, కౌన్సిలర్ పురు షోత్తం,మాజీ కౌన్సిలర్ కిషోర్,మాజీ కో ఆప్షన్ మెంబర్ పన్నాల మాధవ రెడ్డి, పూదరి సుధాకర్ గౌడ్, విష్ణు వర్ధన్, మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డి, మొరపు తేజ,చిరంజీవి, ఫరూక్ బెగ్, జియా ఉల్ హక్,మురళి,వేముల ప్రభాకర్ తదితరులు ఉన్నారు.