పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి: ముఖ్యమంత్రి ఎ. రేవంత్
ఏఐ ముప్పును ఎదుర్కొనడానికి ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచనలు చేయాలి. నవగీతం, హైదరాబాద్: ఒక సునామీలా ముంచుకొస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ముప్పును ఎదుర్కొనడానికి ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఏఐ వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలు కోల్పోతే దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత ప్రమాదంవైపు నెట్టబడుతుందని, ప్రత్యామ్నాయంగా బ్లూ కాలర్ ఉద్యోగాలకు అనుగుణంగా వాతావరణాన్ని మార్చుకోవలసిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. విద్యావేత్త,ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ఇబ్రహింపట్నంలో స్థాపించిన AVN Lakefield Global School ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ...