పిల్లల భవిష్యత్తు కోసం- బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం

నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి: కొడిమ్యాల మండలం అప్పారావుపేట గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సూపర్వైజర్ సుధారాణి మాట్లాడుతూ, 18 సంవత్సరాలు నిండని బాలికకు, 21 సంవత్సరాలు నిండని బాలుడికి వివాహం చేయడం చట్టప్రకారం నేరమని తెలిపారు.అలాంటి వివాహాలు నిర్వహించిన వారికి చట్టం ప్రకారం రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధించబడుతుందని వివరించారు.సఖి కేంద్రం కౌన్సిలర్ గౌతమి మాట్లాడుతూ, బాల్య వివాహాల వల్ల భవిష్యత్తులో...