నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:
మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డిను కలిసేందుకు విచ్చేసిన కే.టి.రామారావుకు ఘన స్వాగతం లభించింది.భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌కు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో స్వాగత కార్యక్రమం నిర్వహించారు. కొడిమ్యాల మండలం పూడూర్ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా సమీకరించి కేటీఆర్‌కు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా స్వాగతం పలుకుతూ పార్టీ పట్ల తమ అంకితభావాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కొడిమ్యాల మండలానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
