నవగీతం,కొడిమ్యాల:
కొడిమ్యాల గ్రామంలో పోచమ్మ ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించేందుకు గ్రామస్థులు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా భక్తుల సహకారం కోరుతూ ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది.గ్రామంలోని లోకమాత శ్రీ ఊల్లే పోచమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు ఏప్రిల్ 9 నుండి ప్రారంభమై ఏప్రిల్ 12 వరకు కొనసాగనున్నాయి.ఈ నాలుగు రోజుల పాటు భక్తులకు అన్నప్రసాదం వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. అన్నప్రసాదం వితరణకు అవసరమయ్యే బియ్యం, కూరగాయలు, కిరాణా సామాను వస్తువులు భక్తులు తమ శక్తి మేరకు అందించవచ్చని నిర్వాహకులు తెలిపారు.అలాగే ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలకు ధనరూపంలో, వస్తు రూపంలో లేదా సేవ రూపంలో సహాయం చేయవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల ద్వారా గ్రామ ప్రజలందరికీ శాంతి, సమృద్ధి కలగాలని లోకమాత శ్రీ ఊల్లే పోచమ్మ తల్లి చరణాలలో ప్రార్థిస్తున్నామని తెలిపారు. అమ్మవారి ఆలయ నిర్మాణానికి సహకరించిన దాత తిరుమలాపూర్ గ్రామానికి చెందిన వోడ్నాల లావణ్య-రాజు కుటుంబం వారి కుమార్తె పార్థ్వీ రూ.11,111/- విరాళంగా అందజేసినట్లు ఆలయ కమిటీ వెల్లడించింది. ఆలయ నిర్మాణానికి సహకరించినందుకు వారికి కమిటీ సభ్యులు ఆలయ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.