నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
ధర్మపురి బార్ అసోసియేషన్ న్యాయవాదులు శనివారం కోరుట్లలో అడిషనల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేణుక యారా ని మర్యాద పూర్వకంగా కలసి ధర్మపురి జూనియర్ సివిల్ కోర్టు శాశ్వత భవనo ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బందెల రమేష్, ఉపాధ్యక్షులు మామిడల శ్రీకాంత్ కుమార్, జనరల్ సెక్రటరీ రామడుగు రాజేష్, ఎక్స్ అఫిసియో మెంబర్ అలుక వినోద్ కుమార్ ,ట్రెస్సరర్ గూడ జితేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ ఒరగంటి చంద్రశేఖర్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ కస్తూరి శరత్ కుమార్, సీనియర్ ఈసి మెంబర్ రౌతు రాజేష్, మరియు న్యాయవాదులు బత్తినీ ఇంద్రకరణ్, జాజల రమేష్ లు పాల్గొన్నారు