నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:
మల్లాపూర్ మండలం సంగెమ్ శ్రీరాంపూర్ గ్రామం లో అంగన్వాడీ కేంద్రం లో పోషణ పఖ్వాడా కార్యక్రమం నిర్వహించారు. పోషకాహారం యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి గర్భిణీ స్త్రీలు , పాలిచ్చే తల్లులు మరియు సంరక్షకులతో సమవేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమము లో ఐ.సీ.డీ.ఎస్ సూపర్వైజర్ శంకరమ్మ మాట్లాడుతూ వేసవి కాలం లో తీసుకోవాల్సిన జాగ్రత్త లు, పిల్లల ఎదుగుదల గురించి వివరించారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ పీ మానస -కిరణ్, ఉప సర్పంచ్ ఎం.భీమన్న, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు ,గ్రామస్తులు పాల్గొన్నారు.