navageetam.com
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 8:29 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

పోషణ పఖ్వాడా లో భాగంగా అవగాహన

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:

మల్లాపూర్ మండలం నడికుడ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం లో పోషణ పఖ్వాడా కార్యక్రమం నిర్వహించారు. పోషకాహారం యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి గర్భిణీ స్త్రీలు ,పాలిచ్చే తల్లులు మరియు సంరక్షకులతో సమవేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమము లో ,ఐ.సీ.డీ.ఎస్ సూపర్వైజర్ శంకరమ్మ మాట్లాడుతూ పిల్లలు ఎదుగుదల,వేసవి కాలం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గర్భిణీ స్త్రీలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు .వివరించారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ టీ. సమత రాజన్న, కార్యదర్శి సంతోషిని, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు ,గ్రామస్తులు పాల్గొన్నారు.