కౌన్సిలర్ కార్యాలయాన్ని ప్రారంభించిన జువ్వాడి నర్సింగరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ వసంత
నవగీతం, కోరుట్ల ప్రతినిధి:
కోరుట్ల పట్టణ పరిధిలోని విలీన గ్రామమైన ఎఖీన్ పూర్ (6వ వార్డు)లో స్థానిక కౌన్సిలర్ మేడిపల్లి శిరీష శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కౌన్సిలర్ కార్యాలయాన్ని బుధవారం కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ.. వార్డు ప్రజలకు ఏ సమస్య ఉన్నా నేరుగా కౌన్సిలర్ దృష్టికి తీసుకురావచ్చని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యాలయం పనిచేస్తుందని తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వార్డు అభివృద్ధికి కృషి చేయాలని కౌన్సిలర్‌కు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షాహిద్ ఉల్ అహ్మద్, స్థానిక కౌన్సిలర్ మేడిపల్లి శిరీష శేఖర్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
