navageetam.com
Newspaper Banner
Date of Publish : 28 April 2026, 9:39 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ప్రతిపక్షాల తప్పుడు ఆరోపణలు తిప్పి కొట్టాలి..

సంక్షేమ పథకాలను ఇంటింటికి వివరించాలి..

ధర్మపురి, బుగ్గారం ముఖ్యనేతలతో మంత్రి అడ్లూరి.

నవగీతం, జగిత్యాల/ధర్మపురి:

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం పై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న తప్పుడు ఆరోపణలు తిప్పి కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుగ్గారం, ధర్మపురి మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సర్పంచులతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సమస్యలు ఏనాడు పట్టించుకోలేదని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడిన ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని మంత్రి అన్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పై పెట్టుకున్న నమ్మకం విశ్వాసానికి అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి తెలిపారు.గడిచిన రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో తమ అడ్రస్ గల్లంతవుతుందని భావించిన ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు గ్యారెంటీలతో పాటు వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని మంత్రి అడ్లూరి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.