navageetam.com
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 5:06 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ప్రతిపక్ష నేత కార్యాలయంపై దాడి ప్రజాస్వామ్యానికి ముప్పు

బంగారు దీపక్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని అంబేద్కర్ సంఘం జిల్లా కన్వీనర్ బంగారు దీపక్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొందరు కాంగ్రెస్‌కు చెందిన గూండాలు ఈ దాడికి పాల్పడటం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందని సూచిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడైన కేసీఆర్ కార్యాలయంపై దాడి చేయడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానపరిచినట్టేనని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష నేత కార్యాలయంపై దాడి జరగడం అత్యంత దుర్మార్గమని, ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తాయని ఆయన అన్నారు..ప్రజల సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను భయపెట్టేందుకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను ప్రజలు ఎప్పటికీ సహించరని హెచ్చరించారు.