ప్రతిపక్ష నేత కార్యాలయంపై దాడి ప్రజాస్వామ్యానికి ముప్పు
- బంగారు దీపక్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని అంబేద్కర్ సంఘం జిల్లా కన్వీనర్ బంగారు దీపక్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొందరు కాంగ్రెస్‌కు చెందిన గూండాలు ఈ దాడికి పాల్పడటం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందని సూచిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడైన కేసీఆర్ కార్యాలయంపై దాడి చేయడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానపరిచినట్టేనని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష నేత...