navageetam.com
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 9:52 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ప్రతిభ కనబరిచిన విద్యార్థినిని అభినందించిన డాక్టర్ రఘు

నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి:

మెట్ పల్లికి చెందిన వడ్డేపల్లి శివకుమార్ స్వప్న కుమార్తె వడ్డేపల్లి శ్రీహర్షిని పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబరచగా నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు అభినందించారు.బుధవారం విడుదలైన పదవ తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదువుకుంటున్న శ్రీ హర్షిని 600 మార్కులకు గాను 564 మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరచగా విద్యార్థినిని డాక్టర్ రఘు అభినందించి సన్మానించారు. భవిష్యత్తులో బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నాయకులు రేండ్ల రాజన్న, మెడిచెల్మెల నాని తదితరులు ఉన్నారు.