navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 11:28 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అట్టహాసంగా క్రీడా, సాంస్కృతిక వేడుకలు!

నవగీతం, కోరుట్ల ప్రతినిధి:

కోరుట్ల స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణం విద్యార్థుల కోలాహలంతో సందడిగా మారింది. కళాశాలలో నిర్వహించిన క్రీడా మరియు సాంస్కృతిక దినోత్సవం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కళాశాల ప్రిన్సిపాల్  నడిగట్ల సందీప్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల అభివృద్ధి కమిటీ సిపిడిసి సభ్యులు ,పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధి మంచాల జగన్  మాట్లాడుతూ.. 45 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ కళాశాల ఎందరో గొప్ప వ్యక్తులను తీర్చిదిద్దిందని కొనియాడారు.ముఖ్యంగా ఈ కళాశాలలో ఉన్న అత్యాధునిక సౌకర్యాలు,క్రీడలకు అనువైన ప్రాంగణం,నిష్ణాతులైన అధ్యాపక బృందం అంకితభావంతో పనిచేస్తున్న ఫ్యాకల్టీ వంటి అంశాలను ప్రస్తావిస్తూ, రాబోయే విద్యాసంవత్సరంలో విద్యార్థినీ విద్యార్థులు అత్యధిక సంఖ్యలో ఈ కళాశాలను ఎంపిక చేసుకుని అడ్మిషన్లు పొందాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రతిభాపాటవాలకు పట్టాభిషేకం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మంచాల జగన్ చేతుల మీదుగా బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. విజేతలకు మెడల్స్, ప్రైజులతో పాటు చదువులో రాణిస్తున్న అర్హులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందజేసి వారిని ప్రోత్సహించారు.ఈ వేడుకలో పూర్వ విద్యార్థులు, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్  రేగుంట రాజారాం కోటగిరి ప్రసాద్ , కట్కం రమేష్  పాల్గొన్నారు. వారితో పాటు కళాశాల అధ్యాపక బృందం, టీచింగ్ నాన్-టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.