navageetam.com
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 6:10 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ను సన్మానించిన ఐకెపి ఎపిఎం

నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి:

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. వేంకయ్యను ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ ఏపీఎం)అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ గట్ల అశోక్ తన కార్యాలయంలో గురువారం రోజున శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏపీఎం అశోక్ మాట్లాడుతూ…ప్రిన్సిపాల్ తనకు విజ్ఞానాన్ని అందించడం వల్లనే తాను ఈ స్థాయిలో ఉన్నానని ప్రకటించారు. క్రమశిక్షణ, వినయ, విధేయతలు గల విద్యార్థులు,ఎప్పుడైనా మంచి స్థానంలో ఉంటారని,అందువల్ల అశోక్ కు పదోన్నతులు సత్వరమే రావాలని మనసారా ఆకాంక్షిస్తున్నానని ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో అటుకుల బాబుతో పాటు ఐకేపీ సీసీలు సూరయ్య, అశోక్,అకౌంటెంట్ ప్రతిభ,వీఓఏలు తదితరులు పాల్గొన్నారు.