navageetam.com
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 10:35 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు నాంది

మండల విద్యాధికారి కేతిరి దామోదర్ రెడ్డి

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:

మల్లాపూర్ మండలంలోని రాఘవపెట్ గ్రామంలో విద్యా ప్రాముఖ్యతను తెలియజేస్తూ బడిబాట కార్యక్రమాన్ని స్థానిక అధికారులు,ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు.సర్పంచ్ తోట శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామ ఉపసర్పంచ్ పాలకవర్గ సభ్యులు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందంతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొని తల్లిదండ్రులకు విద్య అవసరాన్ని వివరించి, పిల్లలను పాఠశాలకు పంపించాలని కోరారు. మండల విద్యాధికారి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ..వచ్చే విద్యాసంవత్సరం నుండి విద్యార్థులకు అవసరమ్యే అన్ని వసతులు బూట్లు, టై, బెల్ట్, కంపాస్  నోట్ బుక్స్ ,టెక్స్ట్ బుక్స్ మెదలైన ప్రత్యేక కిట్ డిజిటల్ మరియు ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ లాంటి ఆధునాతన పద్దతులలో సుశిక్షితులు అనుభజ్ఞులు ఐన ఉపాధ్యాయులతో ఉత్తమ విద్యాబోధన తో పాటు విద్యార్థులకు పాలు రోజుకొక రకమైన మెనూ తో అల్పాహారం అందించనున్నట్లు ఆ విధంగా ప్రభుత్వ బడులలోనే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు నాంది పలుకానున్నట్లు తెలిపారు.మండల విద్యాధికారి కేతిరి దామోదర్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మద్దెల నర్సయ్య గ్రామ కార్యదర్శి మెహన్ వార్డు సభ్యులు అమీనుద్దున్ , నత్తిరాము ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నారాయణ ఉపాధ్యాయులు జగదీశ్వర్,రాజశేఖర్ గ్రామ ప్రముఖులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు