నవగీతం, కోరుట్ల ప్రతినిధి:
కథలాపూర్ మండల పరిధిలోని తక్కళ్లపల్లి గ్రామంలో సోమవారం ముందస్తు ‘బడిబాట’ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. గ్రామంలోని పలు వార్డులలో ఉపాధ్యాయ బృందం ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న నాణ్యమైన విద్య, వసతులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించడమే కాకుండా, తమ పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పిస్తామని వారు స్వచ్ఛందంగా హామీ ఇచ్చారు. ప్రధానోపాధ్యాయులు జయలక్ష్మి మరియు మహేష్ అలాగే ఉపాధ్యాయ బృందం మహేందర్, రమేష్, ప్రసన్నదీప్తి మరియు శ్రావణి పాల్గొన్నారు. మన ఊరి బడిని మనమే కాపాడుకుందామని, అర్హులైన పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం కోరింది.
సిరికొండ గ్రామంలో బడిబాట
విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుతూ సోమవారం రోజున కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని కథలాపూర్ మండల విద్యాధికారి లోకిని శ్రీనివాస్ ప్రారంభించారు.ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని, విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ , దుస్తులు అందజేస్తామని తెలిపారు.పాటు ఐ ఎఫ్ పి లా ద్వారా విద్యాబోధన జరుగుతుందన్నారు. ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాల ప్రాధాన్యత గూర్చి వివరించారు. కార్యక్రమంలో సీరికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లోకిని శ్రీనివాస్, వసంత ఉపాద్యాయులు వనతడుపుల రవికుమార్, చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు.
