navageetam.com
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 4:14 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

బిజెపి ఆధ్వర్యంలో మల్లికార్జున కార్గే దిష్టి బొమ్మ దహనం

నవగీతం, కోరుట్ల ప్రతినిధి:

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనీ తీవ్రవాది అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏఐసీసీ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే దిష్టి బొమ్మను కోరుట్ల భారతీయ జనతా పార్టీ నాయకులు దహనం చేశారు.ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మినారాయణ మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే వయసు ఎక్కువ కావడం తో మతి బ్రమించి మాట్లాడుతున్నాడని కాంగ్రేస్ పార్టీ జాతీయ ముఖ్య నాయకులు కార్గే నీ ఒక మంచి హాస్పిటల్ లో చూపించి చికిత్స చేయించి ఏఐసీసీ పదవి నుండి తొలగించాలన్నారు. ఇకనైనా భారతీయ జనతా పార్టీ గురించి కానీ నాయకులు గురించి గాని నోటికొచ్చింది మాట్లాడితే కాంగ్రెస్ నాయకుల ఇళ్ళముందు వల్ల నాయకుల బొమ్మలను ఇలాగే దహనం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కోరుట్ల పట్టణ కౌన్సిలర్స్ కాలాల రాధ సాయిచంద్, సోరుపాక రమాదేవి రమేష్, గుగ్లావత్ శ్రీకాంత్ తిరుమాల వాసు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎర్ర రాజేందర్,గిన్నెల శ్రీకాంత్, మాడవేణి నరేష్, పోతూగంటి శ్రీనివాస్, నేమురి విజేయ్,సాడిగే మహేష్, రాదారపు సత్యనారాయణ మ్యాకల గణేష్, ఇర్నాల స్వామి, మామిడి మలేష్, బాల్క ప్రేమ్ కుమార్, జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షుడు నాయకులు తుక్కారం గౌడ్, బీజేపీ మండల అధ్యక్షుడు పంచారి విజేయ్, బీజేవైఎం మండల అధ్యక్షుడు వెంకట్ రెడ్డి రాజు, మరియు మండల ఉండ్ర విజేయ్ బోలిశెట్టి రాజేందర్ మండల కార్యవర్గం పట్టణ బీజేపీ బీజేవైఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు