నవగీతం ,కోరుట్ల ప్రతినిధి :
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ అనూప్ రావు ఇటీవల నియమితులైన నేపథ్యంలో, వారు జగిత్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబుతో కలిసి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్ర రావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమకు రాష్ట్ర కమిటీలో బాధ్యతాయుతమైన పదవిని కేటాయించినందుకు గాను రామచంద్ర రావుకి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ భేటీలో జగిత్యాల జిల్లాలో పార్టీ బలోపేతం మరియు భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రజల పక్షాన నిలబడతానని ఈ సందర్భంగా డాక్టర్ అనూప్ రావు పేర్కొన్నారు.