ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆన్ లైన్ లో వివరాల నమోదు చేసిన మంత్రి
నవగీతం,జగిత్యాల/ ధర్మపురి:
దేశవ్యాప్తంగా చేపడుతున్న జనగణన – 2027లో భాగంగా రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్ లైన్ లో వివరాల నమోదు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 26వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు జనగణన చేస్తున్న విషయం తెలిసిందే.. జనగణలో భాగంగా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి జగిత్యాల జిల్లా ధర్మపురి లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వివరాలను ఆన్లైన్ లో నమోదు చేశారు. ప్రభుత్వం చేపట్టిన జనగణనకు ప్రతి ఒక్కరు సహకరించి ఎన్యూమారేటర్లకు వివరాలు అందించాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.