navageetam.com
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 7:03 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మల్లాపూర్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:

మల్లాపూర్ మేజర్ పంచాయతీ లో అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ ఈ సందర్భంగా సర్పంచ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు సర్పంచ్ మాట్లాడుతూ..బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని వివరించి ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తూ ఆయన ఆకాంక్షలను నెరవేర్చే విధంగా పని చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమములో గ్రామ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, కార్యదర్శి శ్రీనివాస్, ఉప సర్పంచ్ సోమ రెడ్డి,వార్డు సభ్యురాలు ఏనుగు లక్ష్మి,కదుర్క లక్ష్మి, కదుర్క రాజేందర్,కొంపెల్లి రాకేష్,ముష్కరి రమేష్,కాషవత్తుల గంగా రెడ్డి,ఎం.డీ శబ్బీర్ అరికుప్పల చిన్న రాజం,భుక్యా శేఖర్, మొరపు గంగారాజం,నూతిపెళ్లి రాజాం,రామ నవీన్,ఉయ్యాల లక్ష్మణ్, పెద్దిరెడ్డి లక్ష్మణ్ సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.

వెంకట్రావు పేట్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు.

మల్లాపూర్ మండలంలోని వెంకట్రావుపేట్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కనుముల వెంకటేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు సర్పంచ్ వెంకటేష్ మాట్లాడుతూ… అంబేద్కర్ చూపిన మార్గం సమాజంలోని అన్ని వర్గాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు. సమానత్వం, స్వాభిమానం, విద్య మరియు హక్కుల సాధన అనే నాలుగు సూత్రాలే సమాజ అభివృద్ధికి పునాదిగా నిలుస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కనుముల వెంకటేష్ ఉప సర్పంచ్ తోట గంగారెడ్డి కార్యదర్శి వేల్పుల సురేష్, పాలకవర్గం సభ్యులు అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.