navageetam.com
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 3:15 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మల్లాపూర్ లో ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు

సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:

ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత వాసవి మాత జయంతి వేడుకలను మల్లాపూర్ మండల కేంద్రంలోని వాసవి మాత ఆలయంలో మండల అధ్యక్షులు సోమ అశ్విన్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.అమ్మవారి ఆలయంలో వాసవి మాత విగ్రహం కు అభిషేకం, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాదాన్ని అందించారు.ఈ సందర్భంగా అశ్విన్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజా ప్రభుత్వం వాసవి జయంతిని అధికారికంగా ప్రకటించడం చాలా హర్షనీయమని అన్నారు.

వాసవి మాత ఆలయంలో జరిగిన అమ్మ వారి జయంతి వేడుకల్లో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు మల్లాపూర్ మాజీ జెడ్పిటిసి ఎల్లాల జలపతి రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ప్రభుత్వం వాసవి మాత జయంతిని  అధికారికంగా ప్రకటించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి, వైశ్య కార్పొరేషన్ చేర్మెన్ కాల్వ సుజాత గుప్త, కాంగ్రెస్ నాయకులు నర్సింగ్ రావు ల చిత్ర పటాలకు మండల వైశ్య సంఘ అధ్యక్షులు అశ్వీన్ కుమార్ గుప్త, కార్యవర్గము తో కలిసి జలపతి రెడ్డి పాలాభిషేకం చేసారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సోమా అశ్విన్ కుమార్. చింత శశిధర్, నూనె శ్రీనివాస్ , రాగళ్ల వెంకటేశ్వర్లు మైలారపు నరేష్, సంగం శ్రీనివాస్, గాదే మనోహర్, శివ శ్రీనివాస్, సామ కళ్యాణ్, సందీప్ మల్లాపూర్ ఉప సర్పంచ్ సోమరెడ్డి, పాలక వర్గ సభ్యులు కాంగ్రెస్ నాయకులు ఆనంద్ గౌడ్, మల్లయ్య, ఎర్ర భూమయ్య, ఎర్ర రమేష్ లతో పాటు ఆయా గ్రామాల ఆర్యవైశ్యులు సతీ సమేతంగా పాల్గొన్నారు.