మల్లాపూర్ లో ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు
సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి: ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత వాసవి మాత జయంతి వేడుకలను మల్లాపూర్ మండల కేంద్రంలోని వాసవి మాత ఆలయంలో మండల అధ్యక్షులు సోమ అశ్విన్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.అమ్మవారి ఆలయంలో వాసవి మాత విగ్రహం కు అభిషేకం, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాదాన్ని అందించారు.ఈ సందర్భంగా అశ్విన్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజా ప్రభుత్వం వాసవి జయంతిని అధికారికంగా ప్రకటించడం చాలా హర్షనీయమని అన్నారు. వాసవి మాత ఆలయంలో...