మానస వార్షికోత్సవం “హంగామా 2026”

ఫోక్ నుండి రెట్రో వరకు కళల హరివిల్లు నవగీతం,జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కేంద్రంలో  విద్యా, సాంస్కృతిక రంగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు “హంగామా 2026 రారండోయ్ వేడుక చూద్దాం …” పేరిట అద్భుతంగా, అత్యంత వైభవంగా, అపూర్వమైన ఉత్సాహంతో ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ మహోత్సవాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ రజితా రావు, ఛైర్మన్  రామాదేవి రవీందర్ రావు,  మౌనిక హరిచరణ్ రావు సంప్రదాయ దీపప్రజ్వలనాతో ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమ ప్రారంభం నుంచే ఆహ్లాదకర వాతావరణం నెలకొని, హాజరైన ప్రతి ఒక్కరిని...