navageetam.com
Newspaper Banner
Date of Publish : 25 April 2026, 3:24 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మార్కెట్ కమిటీ నూతన చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన గడ్డం నారాయణ రెడ్డి గారికి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పొన్నాల గార్డెన్స్‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమె హాజరై, నూతన చైర్మన్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం నారాయణ రెడ్డి గారు నిరంతరం కృషి చేస్తారని, వారి నాయకత్వంలో జగిత్యాల మార్కెట్ కమిటీ మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య, జిల్లా గ్రంథాలయం చైర్మన్ దినేష్,తదితర ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా సాగింది.ఈ వేడుకలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త మోహన్, బండ శంకర్, దామోదర్ రావు, నక్కల రవీందర్ రెడ్డి, చంద్రశేఖర్ గౌడ్, గిరి నాగభూషణం, కౌన్సిలర్లు, మరియు పెద్ద సంఖ్యలో రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.