నవగీతం,కోరుట్ల ప్రతినిధి:
కథలాపూర్ మండలం ఇప్పపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం ముందస్తు బడిబాట కార్యక్రమం నిర్వహించారు.రాబోయే విద్యాసంవత్సరం గ్రామంలోని విద్యార్థులు అందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి పాఠశాల బలోపేతం చేయాలని ఇంటింటి ప్రచారం చేసారు.ఈ కార్యమంలో గ్రామ సర్పంచ్,ఉప సర్పంచ్,వార్డు సభ్యులు, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్, స్కూల్ హెడ్మాస్టర్, సీఆర్పీలు, తల్లితండ్రులు మరియు గ్రామ ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయటం జరిగినది.
